పర్యావరణ పరిరక్షణకు నగర వాటికలు

ABN , First Publish Date - 2021-12-02T05:11:42+05:30 IST

పర్యావరణ పరిరక్షణకు నగర వాటికలు

పర్యావరణ పరిరక్షణకు నగర వాటికలు
రాంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెరుగుతున్న పట్టణ ప్రకృతి వనం

  •  ప్రతీ మున్సిపాలిటీలో 10 హెక్టార్లలో అర్బన్‌ పార్కులు
  • పచ్చదనం పెంపునకు కేంద్రం సాయం

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు, అడవుల అభివృద్ధికి కేంద్ర  ప్రభు త్వం నూతనంగా నగర వాటికల పథకా న్ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా మున్సిపాలిటీల్లో 10 నుంచి 50హెక్టార్ల స్థలంలో అడవులను అభివృద్ధి చేస్తే కేంద్ర  ప్రభుత్వం ఒక్కో హెక్టారుకు రూ.4లక్షలను సమకూర్చనుంది. చాలా రాష్ట్రాల్లో అడవుల శాతం తగ్గి వాతావరణలో వేడి, కర్బణాలు ఎకుకవవడం, కాలుష్యాన్ని నియంత్రిచేందుకు మినిస్ర్టీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కరువు నివా రణకూ ఇది తోడ్పడుతుంది.


  • పల్లె ప్రకృతి వనాలు.. నగర వాటికలు

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, మున్సిపాలిటీల్లో పట్టణ ప్రకృతి వనాలు వీటితో పాటు బృహత్‌ ప్రకృతి సంపద వనాలను అమలు చేస్తోంది. ఈ వనాల పరిధి ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు మాత్రమే ఉంది. వాటిల్లోనే చెట్లు పె ంచేందుకు అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నగర వాటికలను 10 నుంచి 50హెక్టార్లలో ఏర్పాటు చే స్తారు. ఒకే దగ్గర భూమి అందుబాటులో లేకున్నా వేర్వేరు చోట్ల అయినా సరే ప్రభుత్వం నిర్దేశించిన ఏరియా మేరకు చెట్లు పెంచుతారు. ఈ మొత్తాన్ని స్థలంలో వనాలను పెంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో వేచి చూడాలి. అయితే దీనికి భూమి అందుబాటుటో ఉండాల్సి ఉంది. నగర వాటికలను పట్టణ సమీప అటవీ ప్రాంతాల్లో, ఖాళీగా ఉన్న నాన్‌ ఫారెస్ట్‌ స్థలాల్లోనూ మొక్కలు పెంచి వృక్షాలుగా మలచేందుకు పెంచేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిచ్చింది.


  • పచ్చదనానికి ఐదేళ్ల ప్రణాళిక..

ఈ నగర వాటికలను 2021 నుంచి 2025 వరకు ఐదేళ్లలో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ జాగా అందుబాటులో లేకున్నా సదరు మున్సిపాలిటీ పరిధి 5కిలోమీటర్ల దూరంలో స్థలాలున్న చోట్ల ఈ వనాలను పెం చేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిచ్చింది. పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతీ హెక్టారుకు రూ.4లక్షల చొప్పున అభివృద్ధి నిధుల కేటాయించనుంది. ఈ వనా లు పెరిగిన అనంతరం నగర ప్రజలు సం దర్శించేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ నగర వాటికల్లో 2/3ఏరియాల్లో వుడ్‌ ల్యాండ్స్‌, బయో డిస్కవరీ పార్క్స్‌, పూల మొక్కలు, స్మృతి వనాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నగర వాటికల పథకాలు అమలుకు మేడ్చల్‌ జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీల్లో స్థల సేకరణ జరుగుతోందని అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌ తెలిపారు.

Updated Date - 2021-12-02T05:11:42+05:30 IST