రిబేట్‌కు స్పందిస్తున్న పట్టణ ప్రజలు

ABN , First Publish Date - 2020-05-27T11:02:53+05:30 IST

మున్సిపల్‌ పరిధిలో ముందస్తు ఇంటి పన్ను, ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5 శాతం రిబేట్‌ను కలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం

రిబేట్‌కు స్పందిస్తున్న పట్టణ ప్రజలు

రోజు రూ.5 లక్షలకు పైగా ఆస్తి పన్ను వసూళ్లు

స్పెషల్‌ డ్రైవ్‌లో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది


కామారెడ్డి, మే 26: మున్సిపల్‌ పరిధిలో ముందస్తు ఇంటి పన్ను, ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5 శాతం రిబేట్‌ను కలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ శాఖ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలి టీల్లోని పట్టణ ప్రజలు స్పందిస్తూ ముందస్తుగా పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కల్పించిన రిబేట్‌ పొందుతున్నారు. అంతే కాకుండా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో నిత్యం రూ.5 లక్షల వరకు ఆస్తిపన్ను వసూలు అవుతుంది. మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌ రెవెన్యూ అధికారి జానయ్యలు బిల్‌ కలెక్టర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిత్యం ఆస్తి పన్ను వసూలుపై పర్యవేక్షణ చేస్తున్నారు. బిల్‌ కలెక్టర్లు నిత్యం వారికి కేటాయించిన విధుల్లో మొండి బకాయిలపై దృష్టి పెట్టి వారికి రిబేట్‌ 5 శాతం కలిసి వస్తుందని, మే 31 వరకు చెల్లించిన వారే అర్హులవుతారని అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలు, వ్యాపారులు, ఆస్తి పన్నును చెల్లించేందుకు ముందుకు వస్తు న్నారు.


వందశాతం పన్నులు వసూళ్లు చేయాలని లక్ష్యంతో కమిషనర్‌ దేవేందర్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పన్నుల వసూళ్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో పన్నుల వసూళ్లు కామారెడ్డిలో జోరందుకు న్నాయి. గతంలో పన్నుల వసూళ్లకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది ఈ సారి తమ టార్గెట్‌ను వందశాతం పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం కల్పించిన రిబేట్‌ను పొందేందుకు పట్టణ ప్రజలు పోటీ పడుతున్నారు. పన్నులు చెల్లించి రిబేట్‌కు అర్హత సాధిస్తున్నారు. వందశాతం పన్నులు వసూళ్లు చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ జానయ్య ‘ఆంధ్రజ్యోతి’తో తెలిపారు.

Updated Date - 2020-05-27T11:02:53+05:30 IST