Advertisement
Advertisement
Abn logo
Advertisement

చోరీ కేసుల్లో మిస్టరీ చేధించండి

నేర సమీక్షా సమావేశంలో అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

గుంటూరు, నవంబరు 30: అర్బన్‌ పరిధిలో మిస్టరీగా ఉన్న చోరీ కేసులను త్వరితగతిన చేధించాలని అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం పోలీసు కార్యాలయంలో జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఆయన అధికారులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. అర్బన్‌లోని పలుస్టేషన్‌లలో భారీ చోరీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా కేసుల్లో సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి త్వరిగగతిన కేసులు చేదించి సొత్తు రికవరీ చేయాలని ఆదేశించారు. అలాగే దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌ నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు విజుబుల్‌ పోలీసింగ్‌ను కచ్చితంగా అమలు జరపాలన్నారు. అలాగే ప్రతిస్టేషన్‌ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో గస్తీని పెంచాలన్నారు.  అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గస్తీ సమయంలో ప్రతిఒక్కరూ ఫింగర్‌ ప్రింట్‌ మిషన్‌ ద్వారా తనిఖీలు నిర్వహిస్తూ పాత నేరస్థుల కదలికలను గుర్తించాలన్నారు. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‌పై హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ గంగాధరం, డీఎస్పీలు సుప్రజ, సీతారామయ్య, వీవీ రమణకుమార్‌, జెస్సీ ప్రశాంతి, రవికుమార్‌, ప్రకాష్‌బాబు, పి.శ్రీనివాసరావు, బి.చంద్రశేఖర్‌తోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement