Jun 10 2021 @ 22:40PM

ఊర్వశి రౌతెల ఉదారత!

బాలీవుడ్‌ నటి ఆపదలో ఉన్న కరోనా బాధితులను ఆదుకుంటూ ఊర్వశి తన ఉదారతను చాటుకున్నారు. తన ఫౌండేషన్‌ ద్వారా 2 కోట్ల 35 లక్షల వ్యయంతో  47 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను ఉత్తరాఖండ్‌కి 27, మరో 20 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పలు ఆసుపత్రులకు అందించారు. తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా వచ్చే ఆదాయంతో దేశంలోని కొవిడ్‌ బాధితులకు, పాలస్తీనా సొసైటీకి ఆమె సాయం చేస్తున్నారు. ఇటీవల ఆమె ఈజిప్టు నటుడు మహమ్మద్‌ రమ్దాన్‌ సరసన ‘వెర్సాస్‌ బేబీ’ అనే అంతర్జాతీయ ఆల్బమ్‌లో నటించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటారామె! ప్రస్తుతం ఊర్వశి తమిళంలో సైన్సు ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా,  తెలుగులో వస్తున్న ‘బ్లాక్‌ రోజ్‌’ చిత్రంలో నటిస్తున్నారు.