Abn logo
Jan 26 2021 @ 16:02PM

`పుష్ప`తో చిందేయనున్న ఊర్వశి?

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న చిత్రం `పుష్ప`. శేషాచలం అడవుల స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. 


ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. దేవి అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడట. ఈ సాంగ్‌లో నర్తించేందుకు బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలను చిత్రబృందం సంప్రదించినట్టు సమాచారం. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఊర్వశి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్ చిత్రీకరణ జరగబోతోందట.

Advertisement
Advertisement
Advertisement