మద్యం అక్రమ రవాణాపై నిఘా

ABN , First Publish Date - 2020-08-05T10:44:35+05:30 IST

జిల్లాలో మద్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ అధికారులను ఆదేశించారు.

మద్యం అక్రమ రవాణాపై నిఘా

సారా తయారీ స్థావరాలపై దాడులు చేయండి 

 శానిటైజర్లను తనిఖీ చేయండి ఫ ఎస్పీ అమిత్‌బర్దర్‌ 


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 4: జిల్లాలో మద్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఔషధ నియంత్రణ, ఎక్సైజ్‌  అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ‘నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు ముమ్మరం చేయాలి. మద్యం, ఇసుక అక్రమ రవాణాకు ఎట్టిపరిస్థితుల్లోనూ తావివ్వకూడ దు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, పోలీస్‌ సిబ్బంది సమ న్వయంతో పనిచేయాలి. సరిహద్దు ప్రాంతాల్లో నాటు సారా రవాణాపై ప్రత్యేక నిఘాపెట్టాలి. సారా తయారీ కేంద్రాలపై మెరుపుదాడులు చేస్తే పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చు. పోలీ సు సహకారం ఎప్పుడూ ఉంటుంది. ప్రతిభచూపిన వారిని ప్రోత్సహిస్తాం. సమాచార వ్యవస్థను పటిష్ట పర చాల్సిందే. సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు, మొబైల్‌ టాస్క్‌ఫో ర్స్‌ల పనితీరు మరింత మెరుపడాలి. 


నిరంతరం వాహనాల తనిఖీ చేపట్టాలి. అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు. మందుల దుకాణాలు, కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్న శానిటైజర్లను తనిఖీ చేయాలి. ముఖ్యంగా శానిటై జర్లలో నాణ్యత శాతాన్ని పరిశీలించాలి. వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి.’ అని ఎస్పీ స్పష్టం చేశారు.  కార్యక్రమంలో ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుఖేష్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌లు, డ్రగ్స్‌ కంట్రోల్‌ ఏడీ కిరణ్‌కుమార్‌, డ్రగ్‌ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. 


 మత్తు కోసం శానిటైజర్లను  వినియోగించ వద్దు..

కరోనా నేపథ్యంలో చేతులు శుభ్రం చేసుకు నేందుకు మాత్రమే శానిటైజర్లను వినియో గించాలని, మత్తు కోసం ఉపయో గించి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎస్పీ  హితవుపలికారు. మంగళవారం దమ్మలవీధి వాసులకు శానిటైజర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. మద్యానికి అలవాటుపడిన కొందరు మత్తుకోసం శానిటైజర్లు తీసుకొని ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.  చేతుల శుభ్రతకు మాత్రమే శానిటైజర్లను వినియోగించాల న్నారు. కార్యక్రమంలో డ్రగ్‌ఇన్‌స్పెక్టర్‌ కల్యాణి, ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రసాదరావు, సీఐ అంబేద్కర్‌ పా ల్గొన్నారు.  కొవిడ్‌ను జయించిన  పోలీసులకు సన్మానం


 కరోనా వైరస్‌ను జయించిన పోలీసులను ఎస్పీ అమిత్‌బర్దర్‌ మంగళవారం సన్మానించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరి గింది.  కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న  హోంగార్డు నుంచి సీఐ స్థాయి వరకు మొత్తం 14 మంది పోలీసులు తిరిగి విధుల్లో చేరారు. వీరిని. దుశ్శాలువ, పూలదండలతో సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మనోధైర్యంతో కరోనాను జయించి మళ్లీ విధుల్లో చేరడం చిన్నవిషయం కాదన్నారు.   ప్లాస్మా థెరపీకి అందరూ సహకరించాలని సూచించారు.  కరోనాను జయించిన జేఆర్‌పురం ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతిరోజూ ఎస్పీ తమతో మాట్లాడి మానసికంగా ధైర్యం నింపారని, దీంతో వేగంగా కోలుకోగలిగామని చెప్పారు.  కార్యక్రమంలో అదనపు ఎస్పీ సోమశేఖర్‌, రెండో టౌన్‌ సీఐ పీవీ రమణ, పోలీసు అసోసియేషన్‌ అధ్యక్షులు కె.అప్పన్న, ఆర్‌ఐ ప్రదీప్‌, ఉమాశంకర్‌, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-05T10:44:35+05:30 IST