యూఎస్ ఎఫ్‌డీఏ కీలక నిర్ణయం.. కొవిడ్ టీకా బూస్టర్ డోస్‌కు ఓకే

ABN , First Publish Date - 2021-08-13T21:02:47+05:30 IST

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. మూడో డోసు కింద ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అగ్రరా

యూఎస్ ఎఫ్‌డీఏ కీలక నిర్ణయం.. కొవిడ్ టీకా బూస్టర్ డోస్‌కు ఓకే

వాషింగ్టన్: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. మూడో డోసు కింద ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ విజృంభిస్తుండటంతో కొద్ది రోజులుగా అక్కడ కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలో యూఎస్ ఎఫ్‌డీఏ.. మూడో డోసుగా ఫైజర్, మోడెర్నా టీకాలను ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఎఫ్‌డీఏ కమిషన్ జానెట్ వుడ్‌కాక్ ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికాలో ప్రస్తుతం మరో వేవ్ మొదలుకాలేదన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు.. అధిక ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. 


Updated Date - 2021-08-13T21:02:47+05:30 IST