Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా టీకా విషయంలో.. అగ్రరాజ్యం మరో కీలక నిర్ణయం!

12 నుంచి 15 ఏళ్ల వయస్సు పిల్లలకు ఫైజర్ టీకా

వాషింగ్టన్: మహమ్మారి కరోనాపై పోరులో భాగంగా అగ్రరాజ్యం అమెరికా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. టీకాల పంపిణీ విషయంలో కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకుని మరీ బైడెన్ సర్కార్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా టీకాల విషయం యూఎస్ మరో కీలక ముందడుగు వేసింది. 12 నుంచి 15 ఏళ్ల వయస్సు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాను అత్యవసర వినియోగానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) తాజాగా ఆమోదం తెలిపింది. ట్రయల్స్‌లో 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలపై ఈ వ్యాక్సిన్ సురక్షింతంగా, సమర్థవంతంగా పనిచేసిన్నట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఇక కరోనాపై పోరులో భాగంగా 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించడం అమెరికా కీలక ముందడుగుగా ఎఫ్‌డీఏ తాత్కాలిక కమిషనర్ జానెట్ వుడ్‌కాక్ అభివర్ణించారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement