అమెరికాలో 2లక్షల మరణాలు.. వ్యాక్సిన్‌పైనే ట్రంప్ ఆశలు!

ABN , First Publish Date - 2020-09-23T20:31:57+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కాగా.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకా

అమెరికాలో 2లక్షల మరణాలు.. వ్యాక్సిన్‌పైనే ట్రంప్ ఆశలు!

వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కాగా.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహమ్మారి కారణంగా అమెరికాలో మరణించిన వారి సంఖ్య మంగళవారం రోజు 2లక్షలు దాటింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా అమెరికాలో 2,00,005 మంది మరణించగా.. కొవిడ్ బారినపడిన వారి సంఖ్య 6.86 మిలియన్లు దాటింది పేర్కొంది. అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. బ్రెజిల్, భారత్‌లు వరుసగా రెండు, మూడవ స్థానాల్లో ఉన్నాయి. బ్రెజిల్‌లో 1.37లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. భారత్‌లో 88,935 మంది మృత్యువాతపడ్డారు. కాగా.. ప్రభుత్వం వైలఫ్యం కారణంగానే రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఆరోపించారు. ఇదిలా ఉంటే.. అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. వ్యాక్సిన్ మాత్రమే ఎన్నికల్లో తనను గట్టెక్కిస్తుందని విశ్వసిస్తున్నారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ‌లో మంగళవారం మాట్లాడిన ట్రంప్..  వ్యాక్సిన్‌ను పంపిణీ చేసి.. మహమ్మారిని అంతం చేస్తామని తెలిపారు. 


Updated Date - 2020-09-23T20:31:57+05:30 IST