హెచ్​-4 వీసాలపై యూఎస్ కోర్టు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2021-02-09T20:32:48+05:30 IST

హెచ్​-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికాలో పనిచేసుకునేందుకు వీలుగా జారీ చేసే హెచ్​-4 వీసాలపై యూఎస్ కోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

హెచ్​-4 వీసాలపై యూఎస్ కోర్టు కీలక ఆదేశాలు

వాషింగ్టన్: హెచ్​-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికాలో పనిచేసుకునేందుకు వీలుగా జారీ చేసే హెచ్​-4 వీసాలపై యూఎస్ కోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వీసాల ప్రస్తుత స్థితిపై మార్చి 4వ తేదీ లోపు ఉమ్మడి నివేదిక సమర్పించాల్సిందిగా సంబంధిత విభాగాలను న్యాయస్థానం ఆదేశించింది. యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కోలంబియా సర్క్యూట్ జడ్జి తాన్యా ఎస్ చుత్కన్ ఈ మేరకు ఆదేశించారు. మార్చి 4వ తేదీ లోపు ఉమ్మడి నివేదిక ఇవ్వాలని తాన్యా కోరారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హయాంలో హెచ్​-4 వీసాలపై తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరిస్తున్నట్లు తాజాగా జో బైడెన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కోర్టు నివేదిక కోరినట్లు సమాచారం. 


2015లో హోమ్​ల్యాండ్​ సెక్యూరిటీస్​ విభాగం జారీ చేసిన నిబంధనపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ మేరకు జడ్జి తాన్యా ఆదేశించారు. కాగా, 2017లో బరాక్ ఒబామా హయాంలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు యూఎస్‌లో పనిచేసుకునేందుకు అనుమతి ఇస్తూ తీసుకువచ్చిన హెచ్​-4 వీసాదారుల్లో 95 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనూ భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములు అధికంగా ఉన్నారని సమాచారం. 

Read more