డైలీ మరణాల్లో అమెరికా సరికొత్త రికార్డు !

ABN , First Publish Date - 2021-01-13T21:27:04+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నెల రోజులుగా దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.

డైలీ మరణాల్లో అమెరికా సరికొత్త రికార్డు !

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నెల రోజులుగా దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకవైపు మహమ్మారి విజృంభణ కొనసాగుతుండడం.. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడడం ఆరోగ్యశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా డైలీ మరణాల్లో యూఎస్‌లో సరికొత్త రికార్డ్ నమోదైంది. గడిచిన 24 గంట్లలో ఏకంగా 4,500 మంది కొవిడ్‌కు బలైనట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. దేశంలో మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి ఒకేరోజు ఇంతమంది మృతిచెందడం ఇదే తొలిసారి అని పేర్కొంది. దీంతో మంగళవారం నాటికి అమెరికా వ్యాప్తంగా కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 380,365కు చేరితే.. వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 22,825,766కు చేరిందని యూనివర్శటీ వెల్లడించింది. కాగా, ఇప్పటికే అగ్రరాజ్యం ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 



Updated Date - 2021-01-13T21:27:04+05:30 IST