US Defense Secretary లాయిడ్ ఆస్టిన్‌కు కొవిడ్

ABN , First Publish Date - 2022-01-03T16:26:06+05:30 IST

యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్‌ కొవిడ్ -19 బారిన పడ్డారు....

US Defense Secretary లాయిడ్ ఆస్టిన్‌కు కొవిడ్

వాషింగ్టన్ : యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్‌ కొవిడ్ -19 బారిన పడ్డారు.దీంతో లాయిడ్ ఆస్టిన్‌ను కనీసం ఐదు రోజుల పాటు ఇంట్లో క్వారంటైన్ చేశామని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.‘‘ఈ ఉదయం పరీక్ష చేయించుకోగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది. నాకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయి. నా వైద్యుడి సూచనలు పాటిస్తూ ఐదురోజులపాటు క్వారంటైన్‌లో ఉంటాను’’ అని లాయిడ్ ఆస్టిన్ చెప్పారు.రాబోయే కీలక సమావేశాల్లో వర్చువల్‌గా తాను హాజరు కాబోతున్నట్లు పెంటగాన్ చీఫ్ చెప్పారు.


డిప్యూటీ సెక్రటరీ హిక్స్ ఇతర విషయాల్లో నా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆస్టిన్ చెప్పారు.తాను చివరిసారిగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను డిసెంబర్ 21వతేదీన కలిశానని, చివరిసారిగా పెంటగాన్‌ను గురువారం సందర్శించానని ఆయన పేర్కొన్నారు.తాను గురువారం నుంచి పెంటగాన్ కేంద్రానికి దూరంగా ఉన్నానని చెప్పారు.తన సిబ్బందిలోని కొంతమంది సభ్యులతో సామాజికంగా దూరంగానే ఉన్నానని ఆస్టిన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.


Updated Date - 2022-01-03T16:26:06+05:30 IST