భారత ప్రాజెక్టులకు అమెరికా డీఎఫ్‌సీ సాయం

ABN , First Publish Date - 2020-06-06T06:46:53+05:30 IST

కొవిడ్‌-19 తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రాజెక్టులకు మద్దతుగా నిలిచేందు కు అమెరికా ఇంటర్నేషనల్‌ డెవల్‌పమెంట్‌ ఫైనాన్స్

భారత ప్రాజెక్టులకు అమెరికా డీఎఫ్‌సీ సాయం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌-19 తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రాజెక్టులకు మద్దతుగా నిలిచేందు కు అమెరికా ఇంటర్నేషనల్‌ డెవల్‌పమెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీఎ్‌ఫసీ) 100 కోట్ల డాలర్లను ఆయా దేశాల్లోని వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా పెట్టనుంది. ఈ మేరకు డీఎ్‌ఫసీ బోర్డు ఆమోదం తెలిపింది. భారత్‌లో ఆహార భద్రతను పెంచే ప్రాజెక్టుకు 2 కోట్ల డాలర్లు సమకూర్చనుంది. భారత్‌లోని వనరుల కొరతను అధిగమించడానికి సౌత్‌ ఏషియా గ్రోత్‌ ఫండ్‌ 2లో 3 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని అమెరికా కాన్సులేట్‌ వెల్లడించింది. భారత్‌లోని ఇంధనం, నీరు, ఆహార రంగాలలోని వ్యాపారాలకు ఏషియా గ్రోత్‌ ఫండ్‌ 2 నిధులు అందిస్తుంది. 

Updated Date - 2020-06-06T06:46:53+05:30 IST