భారత ప్రజలకు జో బైడెన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-08-15T16:33:56+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారతదేశ ప్రజలకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌, అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇండిపెండెంట్స్ డే జరుపుకుంటున్న భారతీయులకు బైడెన్ విషెస్ తెలియజేశారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ప్రజల కోసం అనుక్షణం పాటుపడతాయనే సందేశాన్ని ప్రపంచానికి...

భారత ప్రజలకు జో బైడెన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారతదేశ ప్రజలకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌, అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇండిపెండెంట్స్ డే జరుపుకుంటున్న భారతీయులకు బైడెన్ విషెస్ తెలియజేశారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ప్రజల కోసం అనుక్షణం పాటుపడతాయనే సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అలాగే యూఎస్-ఇండియా బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. 1947, ఆగస్టు 15న గాంధీ శాంతి మార్గదర్శకంలో సత్యం, అహింస మార్గాన్ని అనుసరించి భారత్ స్వాతంత్ర్యం పొందిందని బైడెన్ గుర్తు చేశారు. 


దశాబ్దాలుగా ఇరుదేశాల ప్రజలు, 4 మిలియన్లకు పైగా భారతీయ అమెరికన్ల మధ్య భాగస్వామ్యం బలోపేతమైందని పేర్కొన్నారు. భారతీయ అమెరికన్లు అగ్రరాజ్యం సాధికారతలో కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పారు. అనేక సవాళ్లు, అవకాశాలు ఎదురుచూస్తున్న ప్రస్తుత సమయంలో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యానికి ఇంతకుముందెన్నడూ లేనంత ప్రాధాన్యం సంతరించుకుందని అన్నారు. మునుముందు కూడా ఇరుదేశాల మధ్య ఈ స్నేహభావం ఇలాగే కొనసాగాలని బైడెన్ ఆకాంక్షించారు. అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ కూడా భారత ప్రజల​కు ఇండిపెండెంట్స్ డే విషెస్ తెలిపారు. ఏడు దశాబ్దాల క్రితం ఇరుదేశాల మధ్య బంధం ఏర్పడిందని, ఇప్పుడు అది భాగస్వామ్యంగా మారిందన్నారు. 

Updated Date - 2021-08-15T16:33:56+05:30 IST