తైవాన్‌కు అమెరికా బంపరాఫర్.. వ్యాక్సిన్ డోసుల విరాళం మూడు రెట్లు పెంపు!

ABN , First Publish Date - 2021-06-21T05:25:02+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా తైవాన్‌కు బంపరాఫర్ ఇచ్చింది. తైవాన్‌లో కరోనా పోరాటానికి మద్దతుగా 7.5 లక్షల కరోనా డోసులు విరాళంగా ఇస్తామని గతంలోనే అమెరికా ప్రకటించింది.

తైవాన్‌కు అమెరికా బంపరాఫర్.. వ్యాక్సిన్ డోసుల విరాళం మూడు రెట్లు పెంపు!

తైపీ: అగ్రరాజ్యం అమెరికా తైవాన్‌కు బంపరాఫర్ ఇచ్చింది. తైవాన్‌లో కరోనా పోరాటానికి మద్దతుగా 7.5 లక్షల కరోనా డోసులు విరాళంగా ఇస్తామని గతంలోనే అమెరికా ప్రకటించింది. తాజాగా ఈ డోసుల సంఖ్యను మూడు రెట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా ఉన్నతాధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘మేము ఈ వ్యాక్సిన్ డోసులను రాజకీయ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇవ్వడం లేదు. కేవలం ప్రాణాలు కాపాడటం కోసమే ఈ విరాళం’’ అని అమెరికా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తొలుత అనుకున్న 7.5 లక్షల వ్యాక్సిన్ డోసులను మూడు రెట్లు పెంచి 25 లక్షల వ్యాక్సిన్ డోసులు విరాళంగా ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. తైవాన్‌లో ఇప్పటి వరకూ 13,770 కరోనా కేసులు వెలుగు చూశాయి.

Updated Date - 2021-06-21T05:25:02+05:30 IST