వీసాలపై ట్రంప్‌ విధానాలను వెనక్కి తీసుకోండి..

ABN , First Publish Date - 2020-12-19T12:44:21+05:30 IST

వీసాలపై ట్రంప్‌ అనుసరించిన విధానాలను వెనక్కి తీసుకోవాలని కాబోయే అధ్యక్షుడు జోబైడెన్‌కు చట్టసభలకు చెందిన 60 మంది ప్రతినిధులు విన్నవించారు. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములైన హెచ్‌-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు పని కాలపరిమితిని పెంచాలని కోరారు.

వీసాలపై ట్రంప్‌ విధానాలను వెనక్కి తీసుకోండి..

హెచ్‌-4 వీసాదారుల పని కాలపరిమితి పెంచండి

బైడెన్‌కు అమెరికా చట్టసభల ప్రతినిధుల వినతి

వాషింగ్టన్‌, డిసెంబరు 18 : వీసాలపై ట్రంప్‌ అనుసరించిన విధానాలను వెనక్కి తీసుకోవాలని కాబోయే అధ్యక్షుడు జోబైడెన్‌కు చట్టసభలకు చెందిన 60 మంది ప్రతినిధులు విన్నవించారు. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములైన హెచ్‌-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు పని కాలపరిమితిని పెంచాలని కోరారు. హెచ్‌-1 వీసాదారుల జీవిత భాగస్వామి(భర్త లేదా భార్య)తో పాటు వారి 21 ఏళ్ల లోపు పిల్లలకు హెచ్‌-4 వీసాలను జారీ చేస్తారు. అయితే ట్రంప్‌ అధికారంలోకి రాగానే వలస విధానంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. వీటిలో భాగంగా హెచ్‌-4 వీసాదారులకు పని అనుమతులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అనేక మంది భవితవ్యం ప్రశ్నార్ధకమైంది. ఈ నేపథ్యంలో వారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బైడెన్‌ను అమెరికా చట్ట సభ్యులు కోరారు. 

Updated Date - 2020-12-19T12:44:21+05:30 IST