స్నేహితుడికి సాయం చేసేందుకు వెళ్లి.. 30 అడుగుల బావిలో..!

ABN , First Publish Date - 2020-07-02T07:07:23+05:30 IST

స్నేహితుడి సహాయం చేయబోయి ఓ వ్యక్తి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిస్టోఫర్ టౌన్ అనే వ్యక్తి, ఇల్లు

స్నేహితుడికి సాయం చేసేందుకు వెళ్లి.. 30 అడుగుల బావిలో..!

వాషింగ్టన్: స్నేహితుడి సహాయం చేయబోయి ఓ వ్యక్తి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిస్టోఫర్ టౌన్ అనే వ్యక్తి, ఇల్లు మారుతున్న తన స్నేహితుడికి సహాయం చేయడానికి ఆదివారం రోజు గిల్‌ఫోర్డ్ వెళ్లాడు. తన స్నేహితుడి కొత్త ఇంట్లోకి సామాగ్రి సర్దుతున్న క్రమంలో.. ఇంట్లోనే ఉన్న 30 అడుగుల బావిలో క్రిస్టోఫర్ పడిపోయాడు. ఈ నేపథ్యంలో క్రిస్టోఫర్ కేకలు విని అక్కడకు చేరుకున్న.. అతని స్నేహితుడు వెంటనే పోలీసుకుల సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రిస్టోఫర్‌ను 25నిమిషాల్లో బయటకు తీశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన గిల్‌ఫొర్డ్ పోలీసులు.. ఆ ఇల్లును 1843లో కట్టినట్లు పేర్కొన్నారు. ఇల్లు కట్టిన సమయంలో బావి.. ఇంటి బయటే ఉన్నట్లు తెలిపారు. అయితే 1981లో ఇంటికి మరమ్మత్తులు చేసినప్పడు.. బావిపై చెక్కతో ఫ్లోర్ వేసి.. అక్కడ అదనపు గదిని నిర్మించినట్లు వెల్లడించారు. కాలక్రమంలో బావిపై వేసిన చెక్క ఫ్లోర్ పాడైపోయి.. విరగడంవల్లే క్రిస్టోఫర్ బావిలో పడ్డట్లు వివరించారు. ఈ ప్రమాదంలో క్రిస్టోఫర్‌కు స్వల్పంగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-07-02T07:07:23+05:30 IST