వైరల్ వీడియో.. టెక్సాస్ వ్యక్తిపై నెటిజన్ల ప్రశంసల జల్లు!

ABN , First Publish Date - 2021-02-20T22:09:24+05:30 IST

టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో‌ను చూసిన నెటిజన్లు.. హీరో అంటూ అతణ్ణి ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ముఖ్యంగా టె

వైరల్ వీడియో.. టెక్సాస్ వ్యక్తిపై నెటిజన్ల ప్రశంసల జల్లు!

వాషింగ్టన్: టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో‌ను చూసిన నెటిజన్లు..  హీరో అంటూ అతణ్ణి ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ముఖ్యంగా టెక్సాస్‌లో వాతావరణ పరిస్థితుల కారణంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఓ వైపు నీరు గడ్డకట్టుకపోతుంటూ.. మరో వైపు విపరీతంగా మంచు కురుస్తోంది. టెక్సాస్‌కు చెందిన డాన్ హోమ్స్ తన ఇంటి ప్రాంగణంలో పేరుకుపోయిన మంచును తొలగిస్తున్న సమయంలో అతని పెంపుడు శునకం ఒకటి.. ఆడుకుంటూ గడ్డకట్టుకుపోయిన స్విమ్మింగ్ ఫూల్‌లో పడిపోయింది. ఈ క్రమంలో తీవ్ర అవస్థ పడుతున్న ఆ శునకాన్ని.. స్విమ్మింగ్ ఫూల్ నుంచి బయటకు తీయబోయి డాన్ హోమ్స్ కూడా అందులో పడిపోయారు.


చివరికి ఎముకలు కొరికే చలిని తట్టుకుని.. తన పెంపుడు శునకాన్ని స్విమ్మింగ్‌ఫూల్ నుంచి బయటకు తీశాడు. కాగా.. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన డాన్ హోమ్స్.. ‘మీ పిల్లలు కానీ.. పెంపుడు జంతువులు జంతువులు కానీ ఇలా ప్రమాదానికి గురవ్వొచ్చు. జాగ్రత్తగా ఉండండి’ అంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపట్ల నెటిజన్లు స్పందిస్తూ.. హీరో అంటూ డాన్ హోమ్స్‌ను ప్రశంసిస్తున్నారు. 



వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read more