బోన్‌లెస్ చికెన్ పేరు మార్చండి.. కోర్టుకెక్కిన యువకుడు

ABN , First Publish Date - 2020-09-04T23:21:01+05:30 IST

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో దేశం మొత్తం రాజకీయ వేడి రగులుకున్న అమెరికాలో ఓ యువకుడు బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలంటూ

బోన్‌లెస్ చికెన్ పేరు మార్చండి.. కోర్టుకెక్కిన యువకుడు

నెబ్రాస్కా (అమెరికా): అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో దేశం మొత్తం రాజకీయ వేడి రగులుకున్న అమెరికాలో ఓ యువకుడు బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలంటూ కోర్టుకెక్కి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. సంవత్సరాల తరబడి మనం అబద్ధాల్లో బతికేస్తున్నామని, ఇప్పటికైనా బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలని నెబ్రాస్కాకు చెందిన 27 ఏళ్ల యువకుడు అండెర్ క్రిస్టెన్సన్ లింకోల్న్ సిటీ కౌన్సిల్‌ను ఆశ్రయించాడు.


బోన్‌లెస్ చికెన్ వింగ్స్‌ను నిషేధించాలని క్రిస్టెన్సన్ అభ్యర్థించాడు. బోన్‌లెస్ చికెన్ వింగ్స్ అనేవి చికెన్ వింగ్స్ నుంచి రావని, అది బ్రెస్ట్ ప్రాంతం నుంచి వస్తుందని, కాబట్టి అందులో బోన్స్‌ ఉండే అవకాశం లేదని పేర్కొన్నాడు. మనం చాలా కాలంగా అబద్ధాల్లో బతికేస్తున్నామని, కాబట్టి బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలని కోరారు. బోన్‌లెస్ చికెన్ పేరును ‘బఫెలో స్టైల్ చికెన్ టెండర్స్, వెట్ టెండర్స్, సాసీ నగ్స్, ట్రాష్’ వంటి వాటిలో ఏదో ఒక పేరు పెట్టాలని క్రిస్టెన్సన్ కౌన్సిల్‌ను అభ్యర్థించాడు.  

Updated Date - 2020-09-04T23:21:01+05:30 IST