స్నాప్‌డీల్‌కు షాకిచ్చిన అమెరికా!

ABN , First Publish Date - 2021-01-16T00:15:17+05:30 IST

భారత్‌లో ఉన్న అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థలలో స్నాప్‌డీల్ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. అ

స్నాప్‌డీల్‌కు షాకిచ్చిన అమెరికా!

వాషింగ్టన్: భారత్‌లో ఉన్న అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థలలో స్నాప్‌డీల్ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. అయితే.. స్నాప్‌డీల్ సహా మరో నాలుగు భారత షాపింగ్ కాంప్లెక్స్‌లకు అమెరికా షాకిచ్చింది. ఫేక్, బ్యాడ్ క్వాలిటీ వస్తువలను అమ్మే మార్కెట్‌ల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో ముంబాయిలోని హీరా పన్నా, కోల్‌కతాలోని కిండర్‌పోర్, ఢిల్లీలోని పాలికా బజార్, టాంక్ రోడ్‌ మార్కెట్‌లు ఉన్నాయి. కాగా.. ఐజ్వాల్‌లోని మిలీనియం సెంటర్ స్థానాన్ని ఈ ఏడాది పాలికా బజార్ ఆక్రమించింది. స్నాప్‌డీల్‌లో గత ఏడాది నకిలీ వస్తువుల పరిమాణం పెరిగినట్టు యూనైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రెసెంటేటివ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. 2018లో నిర్వహించిన సర్వేలో 37శాతం కస్టమర్లు స్నాప్‌డీల్‌పై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పింది. ఈ ఈ-కామర్స్ సంస్థ తమకు నకిలీ వస్తువులను అట్టగట్టినట్టు పేర్కొన్నారని తెలిపింది. నకిలీ వస్తువులను అమ్ముతున్న కారణంగా స్నాప్‌డీల్ సంస్థ వ్యవస్థాపకులు 2019లో ఇండియాలో క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నట్టు గుర్తు చేసింది. 


Updated Date - 2021-01-16T00:15:17+05:30 IST