ప్లిస్కోవాకు షాక్‌..!

ABN , First Publish Date - 2020-09-04T10:15:17+05:30 IST

యూఎస్‌ ఓపెన్‌లో సీడెడ్‌ ప్లేయర్లకు వరుసగా షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. టాప్‌ సీడ్‌ కరో లినా ప్లిస్కోవా, 10వ సీడ్‌ ...

ప్లిస్కోవాకు షాక్‌..!

ముగురుజ కూడా... మూడో రౌండ్‌కు జొకో, ఒసాక 

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో సీడెడ్‌ ప్లేయర్లకు వరుసగా షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. టాప్‌ సీడ్‌ కరో లినా ప్లిస్కోవా, 10వ సీడ్‌ గార్బినె ముగురుజ రెండో  రౌండ్‌లోనే ఇంటి బాట పట్టారు. కాగా, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌, జపాన్‌ క్రీడా కారిణి ఒసాకా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్‌ కరోలినా ప్లిస్కోవా 1-6, 6-7(2)తో గార్సియా (బ్రిటన్‌) చేతిలో, స్పెయిన్‌ క్రీడాకా రిణి ముగురుజ 5-7, 3-6తో స్వెటానా పిరంకొవా (బల్గేరియా) చేతిలో ఓటమిపాలయ్యారు. అలాగే 11వ సీడ్‌  రిబయెంకా, 13వ సీడ్‌ రిస్కే, 19వ సీడ్‌ డయానా ఎస్ట్రీమ్‌స్కా కూడా పరాజయం చవిచూశారు. అయితే, ఒసాకా 6-1, 6-2తో కెమిలా జోర్జిపై నెగ్గింది. చెక్‌ భామ పెట్రా క్విటోవా 7-6(2), 6-2తో కొజ్లోవాపై, వికిక్‌ 6-2, 6-1తో ప్యాట్రిక్‌  టిగ్‌పై, 15వ సీడ్‌ సక్కారి (గ్రీస్‌) 2-6, 6-3, 6-2తో బెర్నార్డ్‌ పెరాపై, అనిసిమోవా 4-6, 6-4, 6-1తో కత్రినా స్కాట్‌పై గెలిచారు. 

జొకోవిచ్‌ జోరు..

పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ ముందంజ వేశాడు. రెండో రౌండ్‌లో జొకో 6-7(5), 6-3, 6-4, 6-2తో  కైల్‌ ఎడ్మండ్‌ (బ్రిటన్‌)పై నెగ్గాడు. 4వ సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) 7-6(2), 6-3, 6-4తో క్రిస్సీ (అమెరికా)పై, 5వ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)-బ్రండన్‌ నకషిమాపై గెలి చారు. షఫలోవ్‌ (కెనడా) 6-7(5), 6-4, 6-4, 6-2తో సూన్‌ వునుపై, టేలర్‌ ఫ్రిట్జ్‌ 7-5, 6-3, 6-2తో జిల్లె స్‌ సిమన్‌పై, కామెరూన్‌ నోరి 6-3, 6-4, 6-4తో కోరియాపై, 7వ సీడ్‌ డేవిడ్‌ గోఫిన్‌ 7-6(8), 4-6, 6-1, 6-4తో లాయడ్‌ హ్యారి్‌సపై, పాబ్లో కరెనో బుస్టా 6-1, 6-2, 6-2తో క్రూగర్‌పై గెలుపొందారు.

ఇల్లే.. బెటర్‌..

కరోనా కారణంగా చాలా మంది ఆటగాళ్లు నిర్వాహకులు సూచించిన హోటళ్లలోనే ఉండడానికి ప్రాధాన్యమిచ్చారు. కానీ, సెర్బియా ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ మాత్రం ఈ టోర్నీ సమయంలో ఒంటరిగా ఓ ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా రూ. 30 లక్షలతో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కొంచెం ఖరీదే అయినా.. దాని వల్ల లభించే సౌకర్యాలను వెలకట్టలేమని జొకో అన్నాడు. 

Updated Date - 2020-09-04T10:15:17+05:30 IST