పట్టాలపై చిక్కుకున్న వృద్ధుడు.. అటువైపు దూసుకొచ్చిన రైలు.. చివరికి!

ABN , First Publish Date - 2020-08-14T00:05:14+05:30 IST

అమెరికాలో 66ఏళ్ల వృద్ధుడు ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వై

పట్టాలపై చిక్కుకున్న వృద్ధుడు.. అటువైపు దూసుకొచ్చిన రైలు.. చివరికి!

వాషింగ్టన్: అమెరికాలో 66ఏళ్ల వృద్ధుడు ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఓ 66ఏళ్ల వృద్ధడు నడవ లేడు. వీల్‌చైర్‌పై కూర్చొని ఒంటరిగా రోడ్డుపై ఉన్న రైలుపట్టాలు దాటుతున్న క్రమంలో.. ఆయన కుర్చీ పట్టాలపై ఇరుక్కుంది. దీంతో ఆ వృద్ధడు.. రైలు పట్టాలు దాటలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పట్టాలపై రైలు.. వృద్ధడివైపు దూసుకొస్తుంది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న ఓ మహిళా పోలీసు అధికారి.. సదరు వృద్ధుడిని పట్టాలపై నుంచి పక్కకు లాగి.. ఆయన ప్రాణాలను కాపాడారు. సినిమాలో సీన్‌ను తలపించేలా.. పట్టాలపై చిక్కుకున్న వృద్ధుడ్ని పోలీసు అధికారి పక్కకు తప్పించగానే.. అక్కడ నుంచి రైలు దూసుకెళ్లింది. పోలీసు అధికారి అక్కడకు చేరుకోవడం క్షణం ఆలస్యం అయినా.. సకాలంలో ఆ వృద్ధుడ్ని పట్టాలపై నుంచి తప్పించలేకపోయినా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కాగా.. ఈ దృశ్యాలు పోలీసు అధికారి వద్ద ఉన్న కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను పోలీసు అధికారులు.. ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 


Updated Date - 2020-08-14T00:05:14+05:30 IST