అఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీని కలవనున్న బైడెన్

ABN , First Publish Date - 2021-06-22T01:17:40+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. అఫ్ఘానిస్థాన్ ప్రెసిడెంట్ అష్రాఫ్ ఘనీని కలవనున్నారు.

అఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీని కలవనున్న బైడెన్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. అఫ్ఘానిస్థాన్ ప్రెసిడెంట్ అష్రాఫ్ ఘనీని కలవనున్నారు. ఆయనతోపాటు హై కౌన్సిల్ ఫర్నేషనల్ రికన్సిలేషన్ చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లాను కూడా బైడెన్ కలుస్తారట. ఈ ఇద్దరు నేతలను శుక్రవారం నాడు వైట్‌హౌస్‌లో బైడెన్ కలిసేందుకు సన్నాహాలు మొదలైనట్లు  వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా బలగాలను వెనక్కు పిలిచేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా అమెరికా బలగాలు ఒక్కొక్కటీ అఫ్ఘాన్‌ను వీడుతున్నాయి. ఈ క్రమంలో అఫ్ఘానిస్థాన్‌లో హింసాత్మక ఘటనలు పెరిగిపోవడంపై ఇరుదేశాల అధ్యక్షులు చర్చించుకుంటారని సమాచారం. ‘‘అఫ్ఘానిస్థాన్ మళ్లీ టెర్రరిస్టుల అడ్డాగా మారకుండా చూస్తాం’’ అని వైట్‌హౌస్ ప్రతినిధి హామీ ఇచ్చారు.

Updated Date - 2021-06-22T01:17:40+05:30 IST