Abn logo
Jul 31 2021 @ 00:00AM

Joe biden పాలక వర్గంలో మరో ఇండియన్ అమెరికన్‌కు చోటు

వాషింగ్టన్: అగ్రరాజ్య అధినేతగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచీ జో బైడెన్ భారతీయులకు పెద్దపీట వేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యాధినేత తాజాగా మరో ఇండియన్ అమెరికన్‌కు తన పరిపాలన యంత్రాంగంలో స్థానం కల్పించారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థకు అమెరికా రాయబారిగా భారతీయ మూలాలున్న రషీద్ హుస్సేన్‌ను బైడెన్ నామినేట్ చేశారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో అమెరికా చరిత్రలోనే అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థకు నామినేట్ అయిన మొదటి ముస్లిం వ్యక్తిగా హుస్సేన్ గుర్తింపు పొందారు. ఇదిలా ఉంటే.. హుస్సేన్ ప్రస్తుతం అమెరికా జాతీయ భద్రతా మండలిలో ఓ విభాగానికి డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 


తాజా వార్తలుమరిన్ని...