అగ్ర‌రాజ్యాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి.. దేశంలో మళ్లీ పూర్తిస్థాయి ఆంక్షలు

ABN , First Publish Date - 2020-07-09T13:25:31+05:30 IST

కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. మంగళవారం అమెరికా వ్యాప్తంగా 55,442 కేసులు నమోదవగా.. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 30 లక్షలు దాటిపోయింది. ముఖ్యంగా టెక్సాస్‌ రాష్ట్రం కరోనాతో విలవిల్లాడుతోంది. మంగళవారం ఒక్కరోజే ఇక్కడ రికార్డు స్థాయిలో 10 వేల కేసులు వెలుగు చూశాయి.

అగ్ర‌రాజ్యాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి.. దేశంలో మళ్లీ పూర్తిస్థాయి ఆంక్షలు

ఒక్కరోజే 10 వేలకుపైగా కేసులు

అమెరికాలో 55వేల మందికి వైరస్‌

బ్రెజిల్‌లోనూ ఆగని కరోనా ఉధృతి

వాషింగ్టన్‌, జూలై 8: కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. మంగళవారం అమెరికా వ్యాప్తంగా 55,442 కేసులు నమోదవగా.. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 30 లక్షలు దాటిపోయింది. ముఖ్యంగా టెక్సాస్‌ రాష్ట్రం కరోనాతో విలవిల్లాడుతోంది. మంగళవారం ఒక్కరోజే ఇక్కడ రికార్డు స్థాయిలో 10 వేల కేసులు వెలుగు చూశాయి. న్యూయార్క్‌, ఫ్లోరిడా తర్వాత టెక్సా్‌సలోనే ఒక్కరోజులో 10వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. టెక్సా్‌సలో కొత్తగా 10,028 మందికి వైరస్‌ సోకినట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,715 మంది చనిపోయినట్టు తెలిపారు.


ఫోర్త్‌ ఆఫ్‌ జూలై (స్వాతంత్య్ర దినోత్సవం) వీకెండ్‌ సందర్భంగా అమెరికన్లు విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చి పార్టీలు చేసుకోవడంతో వైరస్‌ తీవ్రస్థాయిలో వ్యాపించింది. దీంతో చేసేదేం లేక అనేక రాష్ట్రాలు తిరిగి పూర్తిస్థాయి ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి. ఆరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్‌ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. ఫ్లోరిడాలోని అనేక నగరాలు కరోనాకు కేంద్రంగా మారడంతో రెస్టారెంట్లు, జిమ్‌లు, ఫంక్షన్‌ హాళ్లను మూసివేస్తున్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. మరోవైపు బ్రెజిల్‌లోనూ వైరస్‌ విలయం కొనసాగుతోంది. 24 గంటల్లో ఇక్కడ 45,305 మందికి వైరస్‌ సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 16,68,589కి చేరుకుంది. తాజాగా 1,254 మంది మృత్యువాత పడడంతో మొత్తం మృతుల సంఖ్య 66,741కి పెరిగింది. 

Updated Date - 2020-07-09T13:25:31+05:30 IST