Americaలో కొవిడ్ ఒమైక్రాన్ వేరియెంట్ మొదటి కేసు

ABN , First Publish Date - 2021-12-02T12:44:19+05:30 IST

అమెరికా దేశంలోనూ కొవిడ్ కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ మొదటి కేసు తాజాగా వెలుగుచూసింది...

Americaలో కొవిడ్ ఒమైక్రాన్ వేరియెంట్ మొదటి కేసు

వాషింగ్టన్ : అమెరికా దేశంలోనూ కొవిడ్ కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ మొదటి కేసు తాజాగా వెలుగుచూసింది.కాలిఫోర్నియా నగరంలో ఒమైక్రాన్ కొత్త వేరియెంట్ కేసు వెలుగుచూడటంతో అమెరికన్లు అందరూ కొవిడ్ టీకాలు వేయించుకోవాలని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌసీ కోరారు.‘‘ప్రజలను రక్షించడానికి మేం ఏం చేయాలో మాకు తెలుసు. మీరు ఇప్పటికే టీకాలు వేయించుకోకుంటే వెంటనే టీకాలు వేయించుకోండి.ఎంఆర్ఎన్ఏ లేదా లేదా జాన్సన్ అండ్ జాన్సన్‌ టీకాలను  వేయించుకోండి’’ అంటూ వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంథోని ఫౌసీ సూచించారు.నవంబర్ 30వతేదీ నాటికి 197.1 మిలియన్ల మంది యూఎస్ జనాభాలో 60 శాతం మంది పూర్తిగా టీకాలు వేయించుకున్నారు. 


యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి వచ్చిన డేటా ప్రకారం 41.1 మిలియన్ల మంది బూస్టర్ షాట్‌ను వేయించుకున్నారు. కాలిఫోర్నియాలో రెండు డోసుల టీకాలు వేయించుకున్న ప్రయాణికుడికి ఒమైక్రాన్ వేరియెంట్ సోకిందని ఫౌసీ చెప్పారు. కొత్త వేరియెంట్ సోకిన రోగి సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాడని, రోగి కలిసిన వారిని పరీక్షించగా కరోనా నెగిటివ్ అని వచ్చిందని అమెరికా అధికారులు చెప్పారు. ఒమైక్రాన్ వేరియెంట్ వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ప్రతీరోజూ వైద్యబృందంతో సమీక్షిస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి విలేకరులకు చెప్పారు. యూఎస్‌కు వచ్చే ప్రయాణికులకు పరీక్షల నియమాలను కఠినతరం చేస్తామని యూఎస్ అధికారులు చెప్పారు. 


Updated Date - 2021-12-02T12:44:19+05:30 IST