సంస్కృత శ్లోకాలతో ఉగాది విషెస్ చెప్పిన అమెరికన్‌ గాయని !

ABN , First Publish Date - 2021-04-14T13:44:11+05:30 IST

ఉగాది, గుడిపడ్వా, వైశాఖి.. ఇలా పేర్లు ఏవైనా హిందువులకు మంగళవారం కొత్త సంవత్సరాది. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకునే రోజు. ఇదేమీ కొత్త కాదు. ఈ గ్రీటింగ్స్‌నే మనకు భారతీయ మూలాలతో అస్సలు సంబంధం లేని వ్యక్తి చెబితే ఇంకెంతో ప్రత్యేకం. అమెరికా ప్రముఖ గాయని, నటి మేరీ మిల్లీబెన్‌ ఇలానే భారతీయులను మురిపించారు.

సంస్కృత శ్లోకాలతో ఉగాది విషెస్ చెప్పిన అమెరికన్‌ గాయని !

భారతీయులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మేరీ మిల్లీబెన్‌ 

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 13: ఉగాది, గుడిపడ్వా, వైశాఖి.. ఇలా పేర్లు ఏవైనా హిందువులకు మంగళవారం కొత్త సంవత్సరాది. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకునే రోజు. ఇదేమీ కొత్త కాదు. ఈ గ్రీటింగ్స్‌నే మనకు భారతీయ మూలాలతో అస్సలు సంబంధం లేని వ్యక్తి చెబితే ఇంకెంతో ప్రత్యేకం. అమెరికా ప్రముఖ గాయని, నటి మేరీ మిల్లీబెన్‌ ఇలానే భారతీయులను మురిపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతసంతతి ప్రజలకు.. ఆమె కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృత శోక్లాలను పఠిస్తూ శుభాకాంక్షాలు తెలుపుతున్న వీడియోను ఆమె విడుదల చేశారు. గత దీపావళి సందర్భంగా ఆమె.. ‘ఓం జై జగదీశ్‌ హరే’ను ఆలపించారు. ఈ వీడియోకు 10లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 

Updated Date - 2021-04-14T13:44:11+05:30 IST