Abn logo
Apr 14 2021 @ 14:19PM

భారతీయుల కొత్త సంవత్సరం.. అమెరికన్ గాయని సంస్కృత శ్లోకాల పఠనం

ఇంటర్నెట్ డెస్క్: ఉగాది, వైశాఖీ, గుడిపడ్వాలను పురస్కరించుకుని భారతీయుల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు అమెరికన్ గాయని మేరీ మిల్‌బెన్. సంస్కృత శ్లోకాలను పఠిస్తూ.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను హిందీ నేర్చుకుంటున్నప్పటి నుంచి భారతీయులతో అనుబంధం మరింత పెరిగిందని మురిసిపోయారు. ఈ నూతన సంవత్సరం సుఖసంతోషాలను తీసుకురావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. భారతీయుల కోసం ఇవాళ తను ప్రార్థనలు చేశానని ఆమె అన్నారు. 

మిల్‌బెన్ పోస్టుకు విశేషమైన స్పందన లభిస్తోంది. పలువురు భారతీయులు, నెటిజన్లు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. మేరీ మిల్‌బెన్ గతంలో దీపావళి తదితర పండుగల సమయాల్లోనూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 


Advertisement
Advertisement