Abn logo
Apr 28 2021 @ 04:32AM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి.. అమెరికా రాష్ట్రం బంపరాఫర్!

వాషింగ్టన్: అమెరికాలోని వెస్ట్ వర్జీనియా రాష్ట్రం బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వచ్చే యువతకు 100 డాలర్ల విలువైన సేవింగ్స్ బాండ్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. 16 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారిని వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్టు వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకోవడం ఎంత అవసరమనే విషయాన్ని నేటి కుర్రాళ్లు నిజంగా తెలుసుకోలేకపోతున్నారని రాష్ట్ర గవర్నర్ జిమ్ జస్టిస్ పేర్కొన్నారు. అత్యధికంగా వ్యాక్సిన్లు వేస్తున్న అమెరికాలోని టాప్ స్టేట్స్‌లో ఒకటిగా ఉన్న వర్జీనియా ఇటీవల వెనకబడింది. ఈ నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.

Advertisement
Advertisement
Advertisement