వ్యాక్సిన్ లాటరీ.. 5గురికి తలో 7 కోట్లు ఇవ్వన్ను అమెరికా రాష్ట్రం!

ABN , First Publish Date - 2021-05-14T04:16:35+05:30 IST

కరోనా వైరస్‌ను నియంత్రించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతం మనందరి ముందు ఉన్న మార్గమని చాలా మంది నిపుణులు చెప్తున్నారు.

వ్యాక్సిన్ లాటరీ.. 5గురికి తలో 7 కోట్లు ఇవ్వన్ను అమెరికా రాష్ట్రం!

ఓహియో: కరోనా వైరస్‌ను నియంత్రించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతం మనందరి ముందు ఉన్న మార్గమని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. అందుకే వ్యాక్సినేషన్‌కు ప్రచారం కల్పించేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచేందుకు అమెరికాలోని ఒక రాష్ట్రం వినూత్నంగా ఆలోచించింది. ఆ రాష్ట్రమే ఓహియో.


ఇక్కడ త్వరలోనే ‘వ్యాక్సిన్ లాటరీ’ తీస్తామని ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ ప్రకటించారు. ‘‘మే 26న తొలిసారి ఈ లాటరీ తీస్తాం. కనీసం తొలి డోస్ వ్యాక్సిన్ వేసుకున్న పెద్దవారిలో ఒకరిని విజేతగా ప్రకటిస్తాం’’ అని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత 5 వారాలపాటు ప్రతి బుధవారమూ ఈ లాటరీ తీస్తారట. ఈ లాటరీల్లో గెలిచిన విజేతలకు తలా ఒక మిలియన్ డాలర్లు (రూ.7కోట్ల రూపయాలపైగా) అందజేస్తారట.

Updated Date - 2021-05-14T04:16:35+05:30 IST