Student Visaపై బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం.. భారత విద్యార్థులకు మేలు!

ABN , First Publish Date - 2021-07-11T15:54:35+05:30 IST

ఇంటర్నెషనల్ స్టూడెంట్ వీసాలపై అమెరికాలోని జో బైడెన్ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసాల చెల్లుబాటయ్యే గడువును ఎత్తివేసింది.

Student Visaపై బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం.. భారత విద్యార్థులకు మేలు!

స్టూడెంట్ వీసాల నిర్ధిష్ట గడువు ఎత్తివేత

వాషింగ్టన్: ఇంటర్నెషనల్ స్టూడెంట్ వీసాలపై అమెరికాలోని జో బైడెన్ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసాల చెల్లుబాటయ్యే గడువును ఎత్తివేసింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ హయాంలో తీసుకువచ్చిన స్టూడెంట్ వీసాలపై నిర్ధిష్ట గడువు విధానానికి బైడెన్ ప్రభుత్వం స్వస్తి పలికింది. దీంతో అంతర్జాతీయ విద్యార్థులు ఎన్ని రోజులు చదువుకోవాలనుకుంటే అన్నిరోజు యూఎస్‌లో ఉండటానికి వీలు ఏర్పడింది. ఇకపై స్టూడెంట్ వీసాలకు ఎలాంటి గడువు ఉండబోదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 6న ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్‌కు చెందిన సుమారు 2లక్షలకు పైగా మంది విద్యార్థులకు మేలు జరుగనుంది. 


కాగా, ఇంతకుముందు అధికారంలో ఉన్న ట్రంప్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల వీసాల గడువును 4ఏళ్లుగా నిర్ధారిస్తూ ప్రత్యేక రూల్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇంటర్నెషనల్ స్టూడెంట్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ రూల్‌పై ఇటీవల బైడెన్ ప్రభుత్వం 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. ఈ 30 రోజుల్లో దీనిపై 32వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. వీటిలో 99 శాతం మంది ఈ రూల్‌ను వ్యతిరేకించారు. కేవలం ఒక్క శాతం మాత్రమే మద్దతు పలికారు. దాంతో స్టూడెంట్ వీసాల నిర్ధిష్ట గడువును ఎత్తివేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది.          

Updated Date - 2021-07-11T15:54:35+05:30 IST