హ్యాండ్ శానిటైజర్లలో మలినాలు ఉన్న పరవాలేదు.. అమెరికా

ABN , First Publish Date - 2020-06-03T21:24:09+05:30 IST

హ్యాండ్ శానిటైజర్లకు ప్రస్తుతం పరిస్థితుల్లో పెరుగుతున్న డిమాండ్, భారీగా పెట్టుబడులు పెట్టిన కంపెనీల హితార్ధం హ్యాండ్ శానిటైజర్లలో కొద్ది మోతాదులో మలినాలను అనుమితిస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.

హ్యాండ్ శానిటైజర్లలో మలినాలు ఉన్న పరవాలేదు.. అమెరికా

వాషింగ్టన్: హ్యాండ్ శానిటైజర్లకు ప్రస్తుతం పరిస్థితుల్లో పెరుగుతున్న డిమాండ్ పెరుగుతున్న నేపపథ్యంలో వాటిల్లో కొద్ది మొత్తంలో మలినాలను ఉన్నప్పటికీ వాటి అమ్మకాలకు అనుమతిస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో హ్యాండ్ శానిటైజర్లు అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తాజా నిర్ణయం ఇథనాల్ తయారీ కంపెనీలకు ఊరట కలిగించనుంది.


కరోనా సంక్షోభం కారణంగా ఈ సంస్థలు హ్యాండ్ శానిటైజర్ ఉత్పత్తివైపు మళ్లాయి అయితే తనీఖీల సమయంలో హ్యాండ్ శానిటైజర్లలో క్యాన్సర్ కారక అసిటాల్డిహైడ్, ఇతర మలినాలు ఉన్నట్టు తేలింది. అప్పటికే చమురు వినియోగిం పడిపోయిన కారణంగా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న ఇథనాల్ సంస్థలపై ఇది మరింత ఒత్తడి పెంచింది. దీంతో అమెరికా ఆహార, మందుల నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదుల చేసింది. కొద్ది మొత్తంలో మలినాలు ఉన్న పరవాలేదని ప్రకటించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. శానిటైజర్లలో బెంజీన్‌ను 2 పీపీఎమ్ స్థాయి వరకూ, అసటాల్డిహైడ్‌ను 50 పీపీఎమ్ వరకూ ఉండేందుకు అనుమతి ఉంది. కొద్ది రోజుల మాత్రమే ఈ సడలింపు అమల్లో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

Updated Date - 2020-06-03T21:24:09+05:30 IST