తుపాకీ వాడేందకు ఇక లైసెన్స్‌తో పని లేదు.. ఎక్కడంటే!

ABN , First Publish Date - 2021-06-18T05:27:14+05:30 IST

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్‌తో పని లేకుండా హ్యాండ్ గన్‌ను ఉపయోగించేందుకు రాష్ట్ర ప్రజలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుపై టెక్సాస్ రాష్ట్ర గ

తుపాకీ వాడేందకు ఇక లైసెన్స్‌తో పని లేదు.. ఎక్కడంటే!

వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్‌తో పని లేకుండా హ్యాండ్ గన్‌ను ఉపయోగించేందుకు రాష్ట్ర ప్రజలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుపై టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబోట్ తాజాగా సంతకం చేశారు. దీంతో సెప్టెంబర్ 1 నుంచి  లైసెన్స్ లేకుండానే టెక్సాస్ రాష్ట్ర ప్రజలు హ్యాండ్ గన్ ఉపయోగించే అవకాశం లభించింది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే చట్ట ప్రకారం.. హ్యాండ్ గన్‌ను ఉపయోగించేందుకు శిక్షణ అవసరం లేదు. 21ఏళ్లు అంతకంటే ఎక్కవ వయసుగల వారందరూ తుపాకీని ఉపయోగించవచ్చు చట్టం అనుమతిస్తుంది. అయితే వారిపై ఎటువంటి నేరారోపణలు లేదా ఇతర చట్టపరమైన నిషేధాలు ఉండకూడదు. 


Updated Date - 2021-06-18T05:27:14+05:30 IST