H1B Visa కోసం ఎదురుచూస్తున్న వారికి మరో లక్కీ ఛాన్స్!

ABN , First Publish Date - 2021-07-30T16:46:25+05:30 IST

హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా అగ్రరాజ్యం అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది. హెచ్​-1బీ వీసా కోసం త్వరలోనే రెండో విడత లాటరీ ప్రక్రియను చేపట్టనున్నట్లు అమెరికా వెల్లడించింది.

H1B Visa కోసం ఎదురుచూస్తున్న వారికి మరో లక్కీ ఛాన్స్!

వాషింగ్టన్: హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా అగ్రరాజ్యం అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది. హెచ్​-1బీ వీసా కోసం త్వరలోనే రెండో విడత లాటరీ ప్రక్రియను చేపట్టనున్నట్లు అమెరికా వెల్లడించింది. దీంతో ఇటీవల చేపట్టిన ర్యాండమ్​ సెలక్షన్ ప్రాసెస్​లో ఎంపిక కానివారి ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. డిజిటల్ పద్దతిలో చేపట్టిన మొదటి విడత డ్రాలో కావాల్సినంత మందికి వీసాలు ఇవ్వలేకపోయినందున రెండోసారి ఈ లాటరీని నిర్వహించాలని భావిస్తున్నట్లు యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్​సీఐఎస్​) వెల్లడించింది. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా అవసరాలకు అనుగుణంగా మరిన్ని రిజిస్ట్రేషన్లు అవసరం ఉన్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్​సీఐఎస్ పేర్కొంది. 


ఇక ఇంతకుముందు వచ్చిన ఎలక్ట్రానిక్​ రిజిస్ట్రేషన్లను జులై 28న ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్​లో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ అభ్యర్థులకు తమ పిటిషన్​ దాఖలు చేసేందుకు ఆగస్టు 2 నుంచి నవంబర్​ 3 వరకు అవకాశం ఇచ్చినట్లు చెప్పింది. అయితే, హెచ్​-1బీ పిటిషన్లను ఆన్​లైన్​లో​ ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇక అగ్రరాజ్యంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్‌-1బీ వీసా ద్వారా ప్రతి యేటా వేల సంఖ్యలో విదేశీ నిపుణులు ఉపాధి పొందుతున్న సంగతి తెలిసిందే. వీరిలో అత్యధికంగా భారతీయులు, చైనీయులు ఉంటున్నారు. తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న చాలా మందికి​ మేలు జరగనుంది.

Updated Date - 2021-07-30T16:46:25+05:30 IST