Delta Variant: ప్రయాణాలపై ఆంక్షల విషయమై అమెరికా కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-07-27T16:02:32+05:30 IST

కరోనా డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ప్రయాణాలపై విధించిన ఆంక్షల విషయమై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణాలపై ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Delta Variant: ప్రయాణాలపై ఆంక్షల విషయమై అమెరికా కీలక నిర్ణయం!

వాషింగ్టన్: కరోనా డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ప్రయాణాలపై విధించిన ఆంక్షల విషయమై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణాలపై ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వైట్‌హౌస్ సోమవారం కీలక ప్రకటన చేసింది. దేశంలో డెల్టా కేసులు పెరుగుతున్నందున ప్రస్తుతం ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను యధావిధిగా కొనసాగిస్తున్నట్లు ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి పేర్కొన్నారు. ప్రధానంగా టీకాలు తీసుకోని వారిపై డెల్టా ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ఈ సందర్భంగా సాకి తెలియజేశారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం అగ్రరాజ్యం గత 14 రోజుల్లో బ్రిటన్‌తో పాటు ఐర్లాండ్, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, భారత్ వంటి దేశాలతో కనెక్ట్ అయిన ప్రయాణికులను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే. అలాగే దేశ పౌరులను కెనడా, మెక్సికో వెళ్లడాన్ని కూడా బ్యాన్ చేసింది. అంతేగాక గత వారం యూఎస్ డిపార్ట్‌మెంట్ అండ్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సైతం అమెరికన్లు బ్రిటన్ వెళ్లకూడదని వార్నింగ్ ఇచ్చింది.    

Updated Date - 2021-07-27T16:02:32+05:30 IST