ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్లు పంపనున్న అమెరికా

ABN , First Publish Date - 2021-07-29T05:58:54+05:30 IST

ప్రపంచ దేశాల పెద్దన్న అమెరికా.. ఆఫ్రికా దేశాలకు అండగా నిలబడుతోంది. కరోనా వల్ల ప్రపంచ దేశాలు

ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్లు పంపనున్న అమెరికా

వాషింగ్టన్: ప్రపంచ దేశాల పెద్దన్న అమెరికా.. ఆఫ్రికా దేశాలకు అండగా నిలబడుతోంది. కరోనా వల్ల ప్రపంచ దేశాలు తిప్పలు పడుతున్న ఈ తరుణంలో ఆఫ్రికా దేశాలకు అండగా నిలబడాలని అమెరికా నిర్ణయించింది. ఈ క్రమంలోనే నైజీరియాకు 4 మిలియన్ల మోడెర్నా వ్యాక్సిన్ డోసులు, దక్షిణాఫ్రికాకు 5.6 మిలియన్ల  వ్యాక్సిన్ డోసులు పంపాలని వైట్‌హౌస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కొందరు అమెరికా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలుమార్లు ఆఫ్రికా దేశాలకు అమెరికా నుండి వ్యాక్సిన్లు అందాయి. తాజా షిప్‌మెంట్‌తో కలుపుకుంటే ఇప్పటి వరకూ అమెరికా నుంచి ఆఫ్రికాకు 16.4 మిలియన్ డోసుల వ్యాక్సిన్ అందినట్లు అవుతుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో కరోనా మూడోవేవ్ విజృంభిస్తోంది.

Updated Date - 2021-07-29T05:58:54+05:30 IST