Kabul airport:73 విమానాలను నిర్వీర్యం చేసిన యూఎస్ ఆర్మీ

ABN , First Publish Date - 2021-08-31T16:37:50+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌ను వదిలివెళుతూ అమెరికా సైనిక దళాలు కాబూల్ విమానాశ్రయంలో ఉన్న యూఎస్ సైనిక విమానాలను నిర్వీర్యం చేశారని మంగళవారం వెల్లడైంది....

Kabul airport:73 విమానాలను నిర్వీర్యం చేసిన యూఎస్ ఆర్మీ

కాబూల్ : అఫ్ఘానిస్థాన్‌ను వదిలివెళుతూ అమెరికా సైనిక దళాలు కాబూల్ విమానాశ్రయంలో ఉన్న యూఎస్ సైనిక విమానాలను నిర్వీర్యం చేశారని మంగళవారం వెల్లడైంది.అమెరికా సైనిక దళాలు 20 సంవత్సరాల యుద్ధం తర్వాత సోమవారం రాత్రి అఫ్ఘానిస్థాన్ నుంచి నిష్క్రమించాయి. బయలుదేరే ముందు యూఎస్ మిలిటరీ వారి పలు విమానాలు, హెలికాప్టర్లు,సాయుధ వాహనాలను కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని హంగర్ వద్ద నిలిపివేసింది.యూఎస్ మిలిటరీ కాబూల్ విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు 73 విమానాలు, సాయుధ వాహనాలు, హైటెక్ రాకెట్ రక్షణ వ్యవస్థలను నిలిపివేసింది.


కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటికే 73 విమానాలను నిరుపయోగంగా మార్చామని సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కెన్నెత్ మెకెంజీ చెప్పారు.‘‘ఆ విమానాలు మళ్లీ ఎగరవు... వాటిని తాలిబన్లతో సహా ఎవ్వరూ ఆపరేట్ చేయలేరు’’అని కెన్నెత్ మెకెంజీ పేర్కొన్నారు. భవిష్యత్తులో విమానాల ల్యాండింగ్ కోసం పని చేసేలా విమానాశ్రయాన్ని విడిచిపెట్టామని, తాము విమానాలను పేల్చివేయలేదని యూఎస్ అధికారులు తెలిపారు. అమెరికన్ సైనికులు 27 హమ్‌వీస్, 73 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా డిసేబుల్ చేశారు కాబట్టి వాటిని మళ్లీ ఉపయోగించలేరని ఓ అధికారి చెప్పారు.

Updated Date - 2021-08-31T16:37:50+05:30 IST