అగ్రరాజ్యం అమెరికాలో భారీగా త‌గ్గిన నిరుద్యోగుల సంఖ్య!

ABN , First Publish Date - 2021-05-14T18:48:47+05:30 IST

గ‌త కొంత‌కాలంగా క‌రోనా వ‌ల్ల అతలాకుత‌ల‌మైన‌ అగ్రరాజ్యం అమెరికాలో క్ర‌మంగా ప‌రిస్థితులు ఒక్కొక్క‌టిగా చ‌క్క‌బ‌డుతున్నాయి. వైర‌స్ క‌ట్టడికి జో బైడెన్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు స‌త్ఫ‌లితాల‌నిచ్చాయి.

అగ్రరాజ్యం అమెరికాలో భారీగా త‌గ్గిన నిరుద్యోగుల సంఖ్య!

వాషింగ్ట‌న్‌: గ‌త కొంత‌కాలంగా క‌రోనా వ‌ల్ల అతలాకుత‌ల‌మైన‌ అగ్రరాజ్యం అమెరికాలో క్ర‌మంగా ప‌రిస్థితులు ఒక్కొక్క‌టిగా చ‌క్క‌బ‌డుతున్నాయి. వైర‌స్ క‌ట్టడికి జో బైడెన్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు స‌త్ఫ‌లితాల‌నిచ్చాయి. ప్ర‌ధానంగా వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌డంతో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గాయి. ఆర్థిక కార్యాక‌లాపాలు సైతం ఊపందుకుంటున్నాయి. క్ర‌మంగా మ‌మ‌మ్మారి అదుపులోకి వ‌స్తోంది. దీంతో అమెరికా మునుప‌టిలా సాధార‌ణ జీవ‌నం వైపు అడుగులేస్తోంది. తాజాగా సీడీసీ.. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న అమెరిక‌న్లు ఇక మాస్క్ ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం. 


ఇక‌ యూఎస్‌ ఆర్థిక వ్య‌వ‌స్థ గాడిలో ప‌డ‌డంతో తాజాగా అక్క‌డ‌ నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ఆ దేశ‌ కార్మిక శాఖ వెల్ల‌డించింది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసున్నవారి సంఖ్య గత వారం 4,73,000కు పడిపోయిన‌ట్లు తెలియ‌జేసింది. కరోనా సమయంలో ఇదే అతి తక్కువ అని పేర్కొంది. యూఎస్ లేబ‌ర్ డిపార్ట్‌మెంట్‌ గురువారం ప్ర‌క‌టించిన స‌మాచారం ప్ర‌కారం వారం ముందు వ‌ర‌కు 5,07,000గా ఉన్న‌ నిరుద్యోగ భృతి దరఖాస్తుల సంఖ్య ఏకంగా 34వేలు త‌గ్గి..  4,73,000కు పడిపోయిందని తెలిపింది. కాగా, ఈ ఏడాది జనవరిలో ఈ సంఖ్య‌ 9 లక్షలుగా ఉన్న‌ట్లు కార్మిక‌శాఖ వెల్ల‌డించింది. 

Updated Date - 2021-05-14T18:48:47+05:30 IST