బైడెన్‌కు అధికార బాధ్యతల బదిలీపై మైక్ పెన్స్ కీలక వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2021-01-16T01:27:16+05:30 IST

కేపిటల్ ఘటన చోటచేసుకుని దాదాపు 8 రోజులు గడిచిపోయిన తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌ఈఎమ్ఏ

బైడెన్‌కు అధికార బాధ్యతల బదిలీపై మైక్ పెన్స్ కీలక వ్యాఖ్యలు!

వాషింగ్టన్: కేపిటల్ ఘటన చోటచేసుకుని దాదాపు 8 రోజులు గడిచిపోయిన తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌ఈఎమ్ఏ)తో వైస్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్టాడిన మైక్ పెన్స్ .. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌కు పద్ధతి ప్రకారం అధికార బాధ్యతలను అప్పగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సంప్రదాయబద్ధంగా బాధ్యతలను అప్పగించడం ద్వారా అమెరికన్లకు గౌరవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రమాణ స్వీకార మహోత్సవం సురక్షితంగా జరిగేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌పై బైడెన్ ఘన విజయం సాధించారు. ఈనెల 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. బైడెన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు దేశ వ్యాప్తంగా నిరసనలు, అల్లర్లకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తమకు నివేదికలు అందాయని ఎఫ్‌బీఐ ప్రకటించింది. కాగా.. జనవరి 6న జరిగిన కేపిటల్ ఘటన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 7000 మంది నేషనల్ గార్డ్స్ వాషింగ్టన్ నగరంలో మోహరించారు. మరో 20వేల మంది భద్రతా దళాలు సిటీలో పహారా కాయనున్నాయి. 


Updated Date - 2021-01-16T01:27:16+05:30 IST