అమెరికా వీసా ఇంటర్వ్యూ స్లాట్లు.. వ్యాక్సిన్‌తో పనిలేదు?

ABN , First Publish Date - 2021-06-14T11:52:52+05:30 IST

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్‌లను అమెరికా రాయబార కార్యాలయం సోమవారం నుంచి కేటాయించనుంది.

అమెరికా వీసా ఇంటర్వ్యూ స్లాట్లు.. వ్యాక్సిన్‌తో పనిలేదు?

న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్‌లను అమెరికా రాయబార కార్యాలయం సోమవారం నుంచి కేటాయించనుంది. జూలై, ఆగస్టు నెలల్లో సాధ్యమైనంత ఎక్కువ మంది అమెరికా వెళ్లేందుకు వీసాలు ఇస్తామని యూఎస్‌ సీనియర్‌ రాయబారి డాన్‌ హెఫ్లిన్‌ తెలిపారు. అమెరికా వెళ్లాలనుకునే భారత విద్యార్థులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిన అవసరం లేదని, 3 రోజుల క్రితం తీసుకున్న కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు సరిపోతుందని చెప్పారు. టూరిస్టు వీసాలపై నిషేధం ఉన్నందున విద్యార్థుల వెంట వారి తల్లిదండ్రులకు అమెరికా వెళ్లే అనుమతి లేదన్నారు.

Updated Date - 2021-06-14T11:52:52+05:30 IST