Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా ఎఫెక్ట్.. అమెరికా వీసాలు నిలిపివేత !

అత్యవసర వీసాలకు మినహాయింపు

హైదరాబాద్‌:  అమెరికా వీసాలపై కరోనా  ప్రభావం  పడింది. భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో ఇక్కడి నుంచి వచ్చే వారికి ఆ ప్రభుత్వం వీసాలను నిలిపివేసింది. యూఎస్‌ కన్సలేట్‌ నుంచి జారీ అయ్యే అన్ని సాధారణ వీసా సర్వీసులతో పాటు రొటీన్‌ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌, ఇంటర్వ్యూ వేవర్‌ అపాయింట్‌మెంట్‌ వీసాలను మే 3  నుంచి నిలిపి వేస్తున్నట్లు కన్సలేట్‌ జనరల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల సాధారణ అమెరికన్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ అపాయింటెమెంట్‌లను ఈ నెల 27 నుంచే రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, అత్యవసర అమెరికన్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ అండ్‌ వీసా అపాయింట్‌మెంట్‌లు మాత్రం కొనసాగుతాయని ఆ ప్రకటన తెలిపింది.  తదుపరి ఆదేశాలు  వచ్చినంతవరకు  ఈ నిబంధనలు అమలులో ఉంటాయని  కన్సలేట్‌ జనరల్‌ విడుదల చేసిన ప్రకనటలో వివరించారు.  

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement