వర్క్‌ వీసాల జారీలో అమెరికా కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-12-25T13:14:29+05:30 IST

వర్క్‌ వీసాల జారీలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌1బీ సహా పలు రకాల వీసాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూల నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చింది. ఒమైక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కరోనా వైరస్‌ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

వర్క్‌ వీసాల జారీలో అమెరికా కీలక నిర్ణయం!

వర్క్‌ వీసాల జారీలో వ్యక్తిగత ఇంటర్వ్యూలుండవ్‌

త్కాలికంగా రద్దు చేసిన అగ్రరాజ్యం

వాషింగ్టన్‌, డిసెంబరు 24: వర్క్‌ వీసాల జారీలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌1బీ సహా పలు రకాల వీసాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూల నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చింది. ఒమైక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కరోనా వైరస్‌ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. హెచ్‌-1బీ, హెచ్‌-3, హెచ్‌-4, ఎల్‌-1, ఓ, పీ, క్యూ వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ అవకాశం ఇస్తున్నట్టు తెలిపింది. కొవిడ్‌ వైరస్‌ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో  2022 డిసెంబరు 31 వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.


అయితే దీనిపై తుది నిర్ణయం కాన్సుల్‌ అధికారులదేనని స్పష్టం చేసింది. స్థానిక పరిస్థితులను అనుసరించి అవసరమైతే వ్యక్తిగత ఇంటర్వ్యూలు పెట్టే అధికారం  ఎంబసీ, కాన్సులేట్లకు కల్పిస్తున్నట్టు వివరించింది.  ఎప్పుటికప్పుడు దరఖాస్తుదారులు సంబంధిత ఎంబసీ/కాన్సులేట్ల వెబ్‌సైట్లను అనుసరిస్తుండాలని సూచించింది. రెండు డోసులు తీసుకున్న భారతీయులు సహా అంతర్జాతీయ ప్రయాణికులు అందరిపైనా ఆంక్షలను గత నెల 8న అమెరికా ఎత్తివేసింది. కరోనా నెగిటివ్‌ సర్టిఫికెట్‌ ఉన్న వారిని తమ దేశంలోకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-25T13:14:29+05:30 IST