వీడు బాల భీముడు కాదు.. అంతకుమించి.. US లో మహిళ జన్మనిచ్చిన బాబు బరువు తెలిస్తే షాకవ్వాల్సిందే!

ABN , First Publish Date - 2021-10-18T18:52:59+05:30 IST

సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల బరువు ఎంత ఉంటుంది. మహా అయితే 3 నుంచి 4 కిలోల వరకు ఉంటుందనేది మనకు తెలుసు.

వీడు బాల భీముడు కాదు.. అంతకుమించి.. US లో మహిళ జన్మనిచ్చిన బాబు బరువు తెలిస్తే షాకవ్వాల్సిందే!

అరిజోనా: సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల బరువు ఎంత ఉంటుంది. మహా అయితే 3 నుంచి 4 కిలోల వరకు ఉంటుందనేది మనకు తెలుసు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఇంతకుముంచిన బరువుతో కూడా పిల్లలు పుట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ, అమెరికాలో ఓ మహిళ జన్మనిచ్చిన బాబు బరువు ఇప్పుడు నెటిజన్లను నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇంతకు ఆ పిల్లోడి బరువు ఎంతో తెలుసా? అక్షరాల 6.3 కిలోలు. అంటే అప్పుడే పుట్టిన పిల్లల బరువుకు దాదాపు రెట్టింపు అన్నమాట. ఈ బుడ్డోడి బరువు డెలివరీ చేసిన డాక్టర్లను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తితింది. ఇంత భారీ కాయంతో శిశువు జన్మించడం ఇదే తొలిసారి అని ఆ మహిళకు సీజేరియన్ చేసిన వైద్యులు అంటున్నారు. 


అమెరికాలోని అరిజోనాకు చెందిన క్యారీ అనే మహిళనే ఈ బాల భీముడికి జన్మనిచ్చింది. అరిజోనాలోని గ్లెండేల్‌లో ఉన్న బాన్నర్ థండర్‌బర్డ్ మెడికల్ సెంటర్‌లో బాబు పుట్టాడు. సీజేరియన్ ఆపరేషన్ ద్వారా బాలుడిని బయటకు తీసిన వైద్యులు.. అతడి బరువు చూసి షాకయ్యారు. అప్పుడే పుట్టిన ఆ బుడ్డోడు ఏకంగా 6.3 కిలోలు తూగాడు. అది చూసిన డాక్టర్లు నోరెళ్లబెట్టారు. కాగా, అంతకుముందు క్యారీకి రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా 17 సార్లు గర్భస్రావం అయ్యిందట. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా 6.3 కిలోల శిశువుకి జన్మనిచ్చింది. క్యారీ వ్యక్తిగత డాక్టర్ తన 30 ఏళ్ల కెరీర్‌లో అంత బరువైన శిశువుని ఎప్పుడూ చూడలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక క్యారీ దంపతులు ఈ బాల భీముడికి ఫిన్లీ అని పేరు పెట్టారు. ఫిన్లీకి ఇప్పుడే తొమ్మిది నెలల బాబుకి సరిపోయే డ్రెస్ వేస్తున్నారట. తన అధిక బరువుతో ఫిన్లీ ఇప్పుడు అమెరికాలో సెన్సెషనల్‌గా మారాడు. నెట్టింట కూడా వైరల్ అవుతున్నాడు. దాంతో నెటిజన్లు వీడు బాల భీముడు కాదు.. అంతకుమించి అని కామెంట్స్ పెడుతున్నారు. 

Updated Date - 2021-10-18T18:52:59+05:30 IST