ఉసేన్‌బోల్ట్ దంపతులకు కవల పిల్లలు

ABN , First Publish Date - 2021-06-21T16:18:45+05:30 IST

ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్,అతని భాగస్వామి కాసి బెన్నెట్ దంపతులకు కవల పిల్లలు పుట్టారు....

ఉసేన్‌బోల్ట్ దంపతులకు కవల పిల్లలు

వారి పేర్లు ఏమంటే...

ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్,అతని భాగస్వామి కాసి బెన్నెట్ దంపతులకు కవల పిల్లలు పుట్టారు. ఉసేన్ బోల్ట్ తన కవల అబ్బాయిలకు థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అంటూ పేర్లు పెట్టి కుటుంబ ఫొటోను సోషల్ మీడియాలో వెల్లడించారు. కవల పిల్లలతోపాటు కుమార్తె ఒలింపియా కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో ఉసేన్ బోల్ట్ పోస్టు చేశారు.ఉసేన్ బోల్ట్ దంపతులకు ఒలింపియా అనే కుమార్తె 2020 మే నెలలో జన్మించింది. 


ఉసేన్ బోల్ట్ 2008, 2012,2016 క్రీడల్లో 8 బంగారు పతకాలు సాధించారు. చరిత్రలో అత్యంత వేగవంతమైన వ్యక్తిగా బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్ల ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడ్లో 100 మీటర్లు, 200 మీటర్ల డబుల్ గెలిచిన ఏకైక స్ప్రింటర్ ఉసేన్. బోల్ట్ 23 స్వర్ణాలు గెలుచుకున్న తర్వాత 2019లో క్రీడల నుంచి రిటైర్ అయ్యారు. ఉసేన్ బోల్ట్ కవల పిల్లలతో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Updated Date - 2021-06-21T16:18:45+05:30 IST