Jabalpur: డెంగీ నివారణకు కూలర్ల వినియోగంపై నిషేధం

ABN , First Publish Date - 2021-09-15T18:01:19+05:30 IST

దేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లాలో దోమల వ్యాప్తితో డెంగ్యూ జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో కూలర్ల వినియోగాన్ని నిలిపివేయాలని పాలనా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది....

Jabalpur: డెంగీ నివారణకు కూలర్ల వినియోగంపై నిషేధం

జబల్‌పూర్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లాలో దోమల వ్యాప్తితో డెంగ్యూ జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో కూలర్ల వినియోగాన్ని నిలిపివేయాలని పాలనా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. దోమల వ్యాప్తిని నిరోధించాలంటే కూలర్లను వినియోగించరాదని జబల్‌పూర్ జిల్లా అధికారులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్, కాన్పూర్, ప్రయాగరాజ్, మీరట్ జిల్లాలతో పాటు పలు నగరాల్లో డెంగ్యూ జ్వరాలు ప్రబలాయి. డెంగ్యూ జ్వరాలు ప్రబలడానికి దోమల వ్యాప్తి ప్రధాన కారణమని గుర్తించిన అధికారులు కూలర్ల వినియోగాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు.నగరాల్లో దోమల నివారణకు ఫాగింగ్ ను ముమ్మరం చేశారు.ఉత్తర ప్రదేశ్‌లోని పలు జిల్లాలలో పిల్లలకు డెంగ్యూ జ్వరాలు వస్తున్నందున దోమల నివారణకు ఫాగింగ్ ను ముమ్మరం చేశామని ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ చెప్పారు. 

Updated Date - 2021-09-15T18:01:19+05:30 IST