మా ఆస్పత్రులను వాడుకోండి

ABN , First Publish Date - 2020-04-09T09:53:33+05:30 IST

హైదరాబాద్‌లోని అమీర్‌పేట, మాదాపూర్‌లో ఉన్న తమ ఆస్పత్రులను కొవిడ్‌ బాధితులకు వైద్యం కోసం వాడుకోవాలని ఇమేజ్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం ఇమేజ్‌ హాస్పిటల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నీలిమా

మా ఆస్పత్రులను వాడుకోండి

  • కొవిడ్‌ కోసం ఇస్తామంటున్న ‘ఇమేజ్‌’  

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని అమీర్‌పేట, మాదాపూర్‌లో ఉన్న తమ ఆస్పత్రులను కొవిడ్‌ బాధితులకు వైద్యం కోసం వాడుకోవాలని ఇమేజ్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం ఇమేజ్‌ హాస్పిటల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నీలిమా ఆర్య వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి ఇందుకు సంబంధించిన సమ్మతి పత్రాన్ని  అందజేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆ ఆస్పత్రులను ప్రస్తుతం ఐసోలేషన్‌ కోసం వాడుకుంటామని చెప్పారు. కాగా, తమను చూసి మరికొన్ని ఆస్పత్రులు కూడా ఇలాగే ముందుకు వస్తాయని  నీలిమా ఆర్య ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-04-09T09:53:33+05:30 IST