కలర్‌ఫుల్‌ కాటన్‌!

ABN , First Publish Date - 2020-02-21T05:54:43+05:30 IST

ఎండ వేడి మొదలైంది. ఉక్కపోతకు చికాకు పెట్టకుండా ఉండాలంటే... ఆహ్లాదంగా, తేలికగా ఉండే కాటన్‌ దుస్తులనే ధరించాలి. ప్రింటెడ్‌ కాటన్‌ చుడీదార్‌ ఇందుకోసం బెస్ట్‌ ఛాయిస్‌!

కలర్‌ఫుల్‌ కాటన్‌!

ఎండ వేడి మొదలైంది. ఉక్కపోతకు చికాకు పెట్టకుండా ఉండాలంటే... ఆహ్లాదంగా, తేలికగా ఉండే కాటన్‌ దుస్తులనే ధరించాలి. ప్రింటెడ్‌ కాటన్‌ చుడీదార్‌ ఇందుకోసం బెస్ట్‌ ఛాయిస్‌!  


  • ప్రింటెడ్‌ కాటన్‌లో కాంట్రాస్ట్‌ రంగులు ఎంచుకుంటే మరింత ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఇందుకోసం టాప్‌లో ఉన్న డిజైన్‌ను పోలిన రంగు బాటమ్‌ ఎంచుకోవాలి. రెండింటికీ మ్యాచ్‌ అయ్యే కలర్‌ఫుల్‌ చున్నీ జోడించాలి.

  • బెల్‌ హ్యాండ్స్‌, లాంగ్‌ హ్యాండ్స్‌, స్ల్పిట్‌ హ్యాండ్స్‌.... ఎలాంటి డిజైన్‌ కుట్టించుకున్నా కాటన్‌ చుడీదార్‌లో అందంగా కనిపించవచ్చు. అయితే హ్యాండ్స్‌ డిజైన్‌ చేయించేటప్పుడు, బాటమ్‌ లేదా చున్నీ మెటీరియల్‌ వాడుకోవాలి.  

  • పాటియాలా, లెగిన్‌, పలాజో... ఇలా నచ్చిన బాటమ్‌ ధరించవచ్చు. పలాజో, పాటియాలాలకు అదనపు హంగులు జోడించడం కోసం టాప్‌కు కేటాయించిన మెటీరియల్‌ను వాడుకోవాలి.

  • శాండిల్స్‌, ఫ్లాట్స్‌ లాంటి చెప్పులు, సింపుల్‌ జ్యువెలరీ కాటన్‌ చుడీదార్‌లకు నప్పుతాయి. కాబట్టి మెరుపులీనే యాక్సెసరీలకు దూరంగా ఉండాలి. 

Updated Date - 2020-02-21T05:54:43+05:30 IST