కందగడ్డ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?

ABN , First Publish Date - 2021-02-18T20:53:50+05:30 IST

కంద దుంపలలో పొటాషియం, కాల్షియం, విటమిన్‌- ఎ, ఫైబర్‌ ఉంటాయి. కాల్షియం, పొటాషియం, ఖనిజాలు శరీరంలో అన్ని వ్యవస్థల పనితీరు ఆరోగ్యకరంగా ఉండేందుకు అత్యవసరం. వంద గ్రాముల కంద దుంపలో కేవలం ఇరవై ఐదు గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి.

కందగడ్డ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?

ఆంధ్రజ్యోతి(17-02-2021)

ప్రశ్న: నేడు మార్కెట్లో కందగడ్డ విరివిగా లభిస్తోంది. ఇందులో ఎలాంటి పోషక విలువలు ఉంటాయి?


- శ్రీధర్‌, కొల్లాపూర్‌


డాక్టర్ సమాధానం: కంద దుంపలలో పొటాషియం, కాల్షియం, విటమిన్‌- ఎ, ఫైబర్‌ ఉంటాయి. కాల్షియం, పొటాషియం, ఖనిజాలు శరీరంలో అన్ని వ్యవస్థల పనితీరు ఆరోగ్యకరంగా ఉండేందుకు అత్యవసరం. వంద గ్రాముల కంద దుంపలో కేవలం ఇరవై ఐదు గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. పీచు పదార్థాలు అధికం కాబట్టి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. కండలో ఆక్సలేట్స్‌, ఫైటేట్స్‌ అనే యాంటీ నూట్రియెంట్స్‌ ఉంటాయి.సరిగా వండకుండా తింటే దురద, కిడ్నీ సమస్యలు వస్తాయి. ఈ హానికారక పదార్థాలు పోయేందుకు కంద దుంపను కోసిన తరువాత కనీసం గంట పాటు నీటిలో లేదా మజ్జిగలో నాన బెట్టాలి. లేదా పూర్తిగా ఉడికించి మాత్రమే కూర వండడం మంచిది. కేవలం ఆహారంగానేగాక కందను ఆయుర్వేదం, సిద్ధ, యునాని వంటి వైద్య విధానాలలో ఉపయోగిస్తున్నారు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2021-02-18T20:53:50+05:30 IST