పచ్చి కూరల రసాలు మంచివేనా?

ABN , First Publish Date - 2020-10-06T21:00:39+05:30 IST

పచ్చి కూరగాయల రసాలు తాగడం వల్ల ఉపయోగాలేమిటి?

పచ్చి కూరల రసాలు మంచివేనా?

ఆంధ్రజ్యోతి(06-10-2020)

ప్రశ్న: పచ్చి కూరగాయల రసాలు తాగడం వల్ల ఉపయోగాలేమిటి?


-స్వరూప, సికింద్రాబాద్‌


డాక్టర్ సమాధానం: కూరగాయలన్నీ పోషకాలనందించేవే. కొన్ని రకాల పచ్చి కూరగాయల్లో విటమిన్‌ - సి అధికంగా ఉంటుంది. ఉడికించినా, కూరగా వండినా ఈ విటమిన్‌- సి పరిమాణం తగ్గుతుంది. అందువల్ల ఆహారంలో కొంత వరకు పచ్చి కూరగాయలను చేర్చుకోవడం మంచిదే. రసాలూ, జ్యూస్‌ల రూపంలో తీసుకుంటే మాములుగా ఇష్టంగా తినలేని కూరగాయలను బలవంతంగా తీసుకున్నట్టు అవుతుంది. అయితే కూరగాయల జ్యూస్‌లను రుచిగా చేసుకునేందుకు చక్కెర, బెల్లం, తేనె మొదలైనవి కలపడం వల్ల వాటిలో కెలోరీలు అధికమవుతాయి. అంతేకాకుండా జ్యూస్‌ చేసి వడకట్టి పైన పిప్పిని పడేయడం వల్ల ఎంతో విలువైన పీచుపదార్థాల్ని కోల్పోతాం. కాబట్టి వీలున్నంత వరకు పచ్చి కూరగాయలను సలాడ్ల రూపంలో తీసుకుంటేనే ఎక్కువ పోషకాలొస్తాయి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-10-06T21:00:39+05:30 IST