ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లు తాగితే..

ABN , First Publish Date - 2020-10-03T20:23:55+05:30 IST

వేడి లేదా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు తాగటం మంచిదే. చల్లటి నీరు తాగడంలో పోలిస్తే వేడి నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. తగినంత్ నీరు తాగటం వల్ల చర్మం, కండరాలు

ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లు తాగితే..

ఆంధ్రజ్యోతి(03-10-2020)

ప్రశ్న: వేడి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఉపయోగాలేమైనా ఉన్నాయా?


 - సుందరి, వరంగల్


డాక్టర్ సమాధానం: వేడి లేదా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు తాగటం మంచిదే. చల్లటి నీరు తాగడంలో పోలిస్తే వేడి నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. తగినంత్ నీరు తాగటం వల్ల చర్మం, కండరాలు, కీళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శరీర కణాలు పోషకాలను గ్రహించడానికి, వ్యాధులతో పోరాడటానికి నీరు సహాయపడుతుంది. రోజూ కొన్ని గ్లాసుల వేడి నీటిని తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. వేడి నీటిపై శాస్త్రీయ పరిశోధనలు చాలా తక్కువ. అయితే దీర్ఘకాలికంగా వేడినీళ్లు తాగుతున్నవారిలో సాధారణంగా కొన్ని ప్రయోజనాలు కనబడతాయి. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలకు సహాయపడడం ద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ముక్కు కారటం, దగ్గు, గొంతు నొప్పి, అలసట నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. బాగా ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లు తాగడం వల్ల నాలుక, నోరు కాలడం, గొంతులో కణాలు దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి గోరు వెచ్చని నీళ్లను మాత్రమే తీసుకుంటే మేలు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-10-03T20:23:55+05:30 IST